: పండుగలను ధూంధాంగా చేసుకుంటాం: మంత్రి పద్మారావు
మహంకాళి అమ్మవారి బోనాలు, రంజాన్, బతుకమ్మ పండుగలను ధూంధాంగా చేసుకుంటామని మంత్రి పద్మారావు తెలిపారు. ఇవాళ రంజాన్, మహంకాళీ జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ... రంజాన్ పండుగను ప్రభుత్వం తరఫున ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. పండుగల సందర్భంగా జంటనగరాల్లో సీఎం పర్యటిస్తారని ఆయన చెప్పారు. మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో పండుగలను జరుపుకుంటామని ఆయన అన్నారు.