: విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తప్పవు: మంత్రి మహేందర్ రెడ్డి


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన ఘటనలో విజ్ఞాన్ జ్యోతి కాలేజి యాజమాన్యంపై చర్యలు తప్పవని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మండీలో ఆయన మాట్లాడుతూ, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని చెప్పిన ఆయన, విద్యార్థుల వెంట సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. లార్జీ డ్యాం వద్ద సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News