: మమతతో స్వరం కలిపిన నరేంద్ర మోడీ


కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే వివక్షను కేంద్రం పశ్చిమ బెంగాల్ పైనా చూపిస్తోందన్నారు. కాగా, బెంగాల్ ప్రజల కలలను మమత ప్రభుత్వం తీరుస్తుందని నమ్ముతున్నానని అన్నారు. కోల్ కతాలో 'చాంబర్ ఆఫ్ కామర్స్' నిర్వహించిన సదస్సులో ఈ రోజు ప్రసంగించిన మోడీ.. యూపీఏ ప్రభుత్వంలో పాలన స్తంభించి పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశం సమాఖ్య నిర్మాణాన్ని యూపీఏ నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News