: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమవుతోంది
అసెంబ్లీ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. దీంతో పాటు టీడీఎల్పీ కార్యాలయం కూడా ముస్తాబవుతోంది.