: భారత్ కు భూటాన్ అత్యంత సన్నిహిత మిత్ర దేశం: సుష్మాస్వరాజ్
భారత దేశానికి భూటాన్ అత్యంత సన్నిహిత మిత్ర దేశమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. థింపూలో ఆమె మాట్లాడుతూ, భూటాన్ లో సాధారణ ప్రజల నుంచి రాజు వరకు అందరూ అందించిన ఆదరణ తమను ముగ్ధులను చేసిందని, అందుకు ధన్యవాదాలు అనీ చెప్పారు. ప్రభుత్వాలు మారినా ఏ విధమైన మార్పులు లేకుండా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
భూటాన్ కు జల విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో భారత్ సహాయ సహకారాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు, భూటాన్ కు సంయుక్తంగా సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రధాని ఆలోచిస్తున్నారని సుష్మా స్వరాజ్ తెలిపారు.