: యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు నివాసంలో ఏసీబీ సోదాలు
విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు. యలమంచిలిలోని కన్నబాబు ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ఆస్తుల విలువను అధికారులు మదింపు వేస్తున్నారు. కన్నబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ గతంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.