: మాకు సరిపడా కరెంటునివ్వండి మహాప్రభో!


వ్యవసాయానికి సరిపడా కరెంటును సరఫరా చేయాలంటూ రైతన్నలు రోడ్డెక్కారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ఎదుట అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ నిరసన హోరుతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తాము ఫోన్ చేసినా సబ్ స్టేషన్ అధికారులు స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News