: సుగాలి కాలనీ బాధితులను పరామర్శించిన ఎంపీ గల్లా జయదేవ్
తెనాలిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన సుగాలి కాలనీ బాధితులను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పరామర్శించారు. వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన పరిశ్రమల నిర్మాణం, నిరుద్యోగులకు ఉపాధి కల్పన... నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ, బీజేపీ పార్టీ ఆఫీసుల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో పరిశ్రమలకు అనువైన పరిస్థితులను పరిశీలిస్తున్నామని, రాజధాని అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పరిశ్రమలపై పూర్తిగా దృష్టి సారిస్తానని జయదేవ్ చెప్పారు.