: ప్రాణగండం నుంచి బయటపడ్డ ఫార్ములా వన్ డ్రైవర్ షూమాకర్
ఫార్ములా వన్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షూమాకర్ ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. కొంతకాలంగా కోమాలో ఉన్న అతను తాజాగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఆతను ఇంటికి చేరుకున్నాడు. అయితే, షూమాకర్ కు దీర్ఘకాలిక చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఆరు నెలల కిందట అంటే గతేడాది డిసెంబర్ లో స్కీయింగ్ చేస్తూ షూమాకర్ ప్రమాదానికి గురవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు.