: టీ ఎంపీల్లో కోవర్టులు ఎవరో చెప్పండి: ఎంపీ పొన్నం
తెలంగాణ ఎంపీల్లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు కోవర్టులు ఉన్నారని కొన్నిరోజుల కిందట ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కోవర్టులు ఉన్నారని అంటున్న వారే, వారి పేర్లు కూడా చెబితే బాగుంటుందన్నారు. తెలంగాణపై పోరుకు ఈనెల 22న టీ కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. ఇందుకు బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలు సహకరించాలని పొన్నం కోరారు. హోంమంత్రి సబిత వ్యవహారాన్ని సీఎం పరిశీలిస్తారని అన్నారు.