: ఆ ముగ్గురూ అడవిలోకి వెళ్లలేదు... కిడ్నాప్ అయ్యారు!


కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న ఓ బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. మెదక్ జిల్లా జిన్నారం మండలం బొంతపల్లిలో అదృశ్యమైన ముగ్గురు పిల్లలు కిడ్నాప్ నకు గురయ్యారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారు అడవిలోకి వెళ్లి ఉంటారని తొలుత గ్రామస్థులు భావించారు. ఈ నెల 14వ తేదీన నవీన్ కుమార్ (11), జోగినాథ్(8), నాగరాజు (8) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి తమను ఎత్తుకెళ్లినట్టు వారి నుంచి తప్పించుకుని వచ్చిన నవీన్ కుమార్ తెలిపాడు. తమను బైక్ పై కామారెడ్డి తీసుకువెళ్లినట్టు నవీన్ చెప్పాడు. రెండు రోజుల తర్వాత కామారెడ్డి రైల్వేస్టేషనుకు తీసుకురాగా, తాను తప్పించుకుని వేరే రైలు ఎక్కి కాచిగూడ స్టేషనుకు చేరుకున్నానని అతడు చెప్పాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు నవీన్ చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జిన్నారం పోలీసుల సహాయంతో కుమారుడిని ఇంటికి తీసుకువచ్చారు. నవీన్ సోదరుడు జోగినాథ్, నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News