: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం: కిషన్ రెడ్డి
హైదరాబాదులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని ఆయన చెప్పారు. అలాగే, మెదక్ పార్లమెంటు స్థానానికి తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు.