: ఆ ముగ్గురికీ మరణ దండనే సరి: నిర్ధారించిన న్యాయస్థానం
చైనాలో ఉగ్రదాడులకు పాల్పడిన ముగ్గురు తీవ్రవాదులకు మరణశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. మరో ఐదుగురికి యావజ్జీవ ఖైదు విధించింది. బీజింగ్ లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద 2013 అక్టోబర్ లో ఎనిమిది మంది ఉగ్రవాదులు బాగా రద్దీగా ఉన్న మార్కెట్ లో జీపు నడుపుతూ ఇద్దరి మృతికి, మరో 40 మంది గాయపడటానికి కారకులయ్యారు. దీంతో హుసాన్ జన్ వక్సర్, యూసుఫ్ ఉమర్నియాజ్, యూసుఫ్ అహ్మత్ లు ఉగ్రవాద బృందానికి నేతృత్వం వహిస్తూ, ప్రమాదకర పద్ధతుల ద్వారా ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లేలా చేశారంటూ కోర్టు వారికి మరణదండన విధించింది.