: ఢిల్లీ, తమిళనాడు తరహా మద్య విధానం ఉండాలి: వి లక్ష్మణ్ రెడ్డి
ఢిల్లీ, తమిళనాడు తరహాలో మద్యం దుకాణాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్య నియంత్రణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి. లక్ష్మణ్ రెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల్లో కల్లు దుకాణాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని అన్నారు. బెల్టు షాపులను సమూలంగా తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు, బెల్టు షాపులకు విచ్చల విడిగా అనుమతులు జారీ చేయడం వలన అనేక కుటుంబాలు ఇబ్బందులకు లోనవుతున్నాయని ఆయన తెలిపారు.