: ఐదు నెలల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం


టోకు ధరల ద్రవ్యోల్బణం మే నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయి అయిన 6.01 శాతానికి చేరింది. ఆహారోత్పత్తులు, ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు అంతకుముందు మే నెలతో పోలిస్తే 9.5శాతం పెరిగాయి. ఇంధన ధరలు 10.53శాతం ఎగిశాయి. ఆర్థికవేత్తలు మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 5.4శాతంగా ఉంటుందని అంచనా వేయగా వాస్తవ గణాంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక, చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 8.28శాతం ఉన్నట్లు ప్రభుత్వం గురువారమే వెల్లడించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News