: 'ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో 24 గంటలు జాగ్రత్తగా ఉండండి'


ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో 24 గంటల సేపు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్టణంలో వాతావరణ కేంద్రం అధికారి మాట్లాడుతూ, ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని తెలిపారు. మరో 24 గంటల పాటు వడగాలులు తీవ్రంగా ఉంటాయని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వేడిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఆయన 24 గంటల తరువాత వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News