: రూపాయి మళ్లీ వెనక్కి


ఇరాక్ లో అంతర్గత సంక్షోభంతో భారత రూపాయి మళ్లీ బక్కచిక్కుతోంది. డాలర్ తో మారకం విలువ 58 స్థాయికి దిగొచ్చిన రూపాయి కాస్తా... ఇరాక్ లో అంతర్గత పోరుతో మళ్లీ 60 స్థాయికి చేరింది. ఇరాక్ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమన్న విషయం తెలిసిందే. అక్కడి సంక్షోభంతో అంతర్జాతీయంగా చమురు ధర బ్యారెల్ కు 113 డాలర్లకు ఎగసింది. భారత్ అతిపెద్ద చమురు దిగుమతి దేశం కావడంతో పెరిగిన ధరలతో మనదేశ వాణిజ్య లోటు కూడా పెరిగిపోనుంది. ఈ ప్రభావంతో రూపాయి మళ్లీ వెనక్కి ప్రయాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

దీనిపై హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఫారెక్స్ విభాగం హెడ్ అశుతోష్ రైనా మాట్లాడుతూ... ఇరాక్ సంక్షోభం కొనసాగినంత కాలం రూపాయి విషయంలో ఇదే ధోరణి ఉంటుందన్నారు. ఆర్ బీఐ జోక్యం చేసుకోకుండా, సంక్షోభం అలాగే కొనసాగితే రూపాయి మారకం విలువ 60కంటే దిగువనే (అంటే 60కిపైన) ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News