: ఆయన సంగీతం కొత్తగా ఉంటుంది... ఆయనకు పాట పాడా: అమితాబ్
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో నిన్న రాత్రి ఓ పాట పాడానని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. బాల్కి దర్శకత్వంలో త్వరలో రానున్న 'షమితాబ్' సినిమా కోసం బిగ్ బి మరోసారి గొంతు సవరించుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు గాత్రం అందించానని ఆయన ట్వీట్ చేశారు.
ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో ఏళ్లు గడిచినా...ఆయన స్వరాలు సరికొత్తగా ఉంటాయని అమితాబ్ పేర్కొన్నారు. చాలా మంది సంగీత దర్శకులను ఆయన తయారు చేశారని తెలిపిన అమితాబ్, ఇళయరాజా 900 పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారని ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపించారు.