: ఏపీలో విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తా: గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడతానని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18న మంత్రిగా సచివాలయంలో విధులు స్వీకరిస్తానని అన్నారు. బోధనా రుసుముపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు నెలకొన్నందున, పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రితో సమావేశమవుతానని గంటా వెల్లడించారు. ఆ సమావేశం తరువాత కీలక నిర్ణయం వెల్లడిస్తానని గంటా చెప్పారు.