: ముఖ్యమంత్రి ఇంటికి కన్నం వేసిన ఘనులు


సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇంటికే కన్నం వేశారు కొందరు ఘనులు. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రాం ఇబోబి సింగ్ ఇంట్లోకి వెళ్లి గృహోపకరణాలు దొంగిలించారు కొందరు దుండగులు. మణిపూర్ లోని తౌబల్ జిల్లాకు చెందిన ఒక్రాం ఇబోబి సింగ్ కు స్వంత జిల్లాలో నివాసం ఉంది. రాజధానిలో ముఖ్యమంత్రికి అధికారిక నివాసం ఉండడంతో ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదు. అయినా 30 మంది రిజర్వ్ బెటాలియన్ సిబ్బందిని ఆయన ఇంటికి రక్షణగా నియమించారు. వారంతా పక్కనే ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు ఒక్రాం ఇబోటోంబా సింగ్ ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.

దీంతో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా తమ పని కానిచ్చేశారు. ముఖ్యమంత్రి భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లంధోనీ దేవి తమ నివాసానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డీజీపీ సహా సీనియర్ అధికారులు, ఫోర్సెనిక్ నిపుణులు, బాంబు నిర్వీర్యం సిబ్బంది వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తొందర్లోనే దొంగలను పట్టుకుంటామని డీజీపీ తెలిపారు.

  • Loading...

More Telugu News