: ఎండ్రకాయల తోకలను తస్కరించిన మహిళపై కేసు


నగదు దొంగిలించారనో లేక బంగారం, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకుపోయారనో కేసులు పెట్టడాన్ని చూశాం. కానీ, ఎండ్రకాయల తోకలను ఎత్తుకెళ్లడం విన్నారా? అంతేకాదు, దానిపై పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగిపోయింది. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళపై ఇలాంటి చిత్రమైన కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు.

30 ఏళ్ల నికోల్ అన్ రీడ్... ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లి ఫ్రిజ్ లో పెట్టిన ఎండ్రకాయల తోకలు ఓ ఏడింటిని జేబులో వేసుకుని తుర్రుమంది. సూపర్ మార్కెట్ వారి ఫిర్యాదుతో గంట తర్వాత ఆ చోర మహిళను పోలీసులు పట్టుకొచ్చి విచారించారు. తాను ఎండ్రకాయల తోకల కోసమే సూపర్ మార్కెట్ కు వెళ్లినట్లు ఆమె ఒప్పుకుంది. వాటి విలువ 84 డాలర్లు ఉంటుందట. అంటే సుమారు 5వేల రూపాయలు. దీంతో ఆమెపై దొంగతనం ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News