: ఉగ్రవాదులు కూడా ట్వీట్ చేస్తున్నారు!
ట్విట్టర్ అందరి బంధువు అయినట్లుంది. ఉగ్రవాదులు తమ దాడుల గురించి ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా లోకానికి వెల్లడిస్తున్నారు. తాజాగా తాము 1,700 మంది ఇరాక్ సైనికులను మట్టుబెట్టామంటూ అక్కడి ఉగ్రవాదులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందుకు ఆధారాలుగా కొన్ని ఫొటోలను కూడా ట్విట్టర్ లో పెట్టారు. ఇరాక్ ప్రభుత్వం మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇరాక్ లో అంతర్గత పోరు మొదలైన విషయం తెలిసిందే.