: ప్రభుత్వంపై అవిశ్వాసానికి బీజేపీ 'సై'
రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం తగ్గుతోందని.. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని బీజేపీ ప్రకటించింది.
ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ వంటి కీలక అంశం వల్ల రాష్ట్రం పలు కీలక మార్పులకు లోనవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ అడిగే వాళ్లకంటే ఇచ్చే పార్టీని గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు సంస్థాగత ఎన్నికలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే దిశగా రెండు రోజుల పాటు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.