: భూటాన్ పార్లమెంటులో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. మంచి విద్యను అందిస్తే... దేశ మూలాలు బాగుపడతాయని తెలిపారు. విద్య కోసం భూటాన్ ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషదాయకమని అన్నారు.
భారత్ లో ప్రభుత్వాలు మారినా భూటాన్ తో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని భారత ప్రధాని చెప్పారు. రాబోయే దశకంలో ఇంధన భద్రత అత్యంత కీలకమని తెలిపారు. భారత్ అభివృద్ధి చెందితే భూటాన్ కు కూడా మేలు జరుగుతుందని మోడీ అన్నారు. హిమాలయ రాష్ట్రాలు, భూటాన్ మధ్య క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మోడీ ప్రసంగం మొత్తం హిందీలోనే కొనసాగుతుండటం కొసమెరుపు.