: గంగిరెడ్డి ఆస్తులపై విచారణ మొదలుపెట్టిన విశాఖ పోలీసులు
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరులు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని... వారి నుంచి తమ ప్రాణాలకు హాని ఉందంటూ బాధితులు ఏపీ హోం మంత్రి చినరాజప్పను ఆశ్రయించారు. ఇప్పటికే విశాఖలో పలు స్థలాలను గంగిరెడ్డి కబ్జా చేసి... కోట్ల రూపాయలను పోగేసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి ఆస్తులపై విశాఖ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.