: దుబాయ్ నుంచి బెదిరింపులకు దిగుతున్న గంగిరెడ్డి
పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి దుబాయ్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. దుబాయ్ కు వెళ్లినా అతని ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఓ స్థల వివాదంలో తలదూర్చి యజమానిని బెదిరించాడు. విశాఖపట్నం వెంకోజిపాలెంలో స్థలం కబ్జాకు గంగిరెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో, ఏపీ హోం మంత్రి చినరాజప్పను బాధితులు ఆశ్రయించారు.