: హైదరాబాద్ రానున్న నాయిని... ఆయన స్థానంలో మహేందర్ రెడ్డి
బియాస్ నది ప్రమాద స్థలికి తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి బయలుదేరారు. టీ.సీఎం కేసీఆర్ ఆయనకు సహాయక చర్యల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. దీంతో, గత 8 రోజులుగా అక్కడే ఉండి సహాయక చర్యలను చూస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్ తిరుగు పయనం కానున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీఎంకు నాయిని నివేదిక సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా విజ్ఞాన్ జ్యోతి కాలేజీపై చర్యలు తీసుకోనున్నారు.