: టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మృతి
కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు (టీడీపీ) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. నందిగామ శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. నిన్న ఉదయం నుంచి భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలసి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తంగిరాల చక్కెర వ్యాధి, రక్తపోటుతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన కొద్దిసేపటికే వాంతులు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు 11.45 గంటలకు తంగిరాల మృతి చెందినట్టు ప్రకటించారు.