: సబిత, సీఎంతో వేర్వేరుగా మంత్రుల భేటీ
జగన్ అక్రమాస్తుల కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాలుగో నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ నిన్న కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున.. ఈ విషయమై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీ నారాయణ, పితాని సత్యన్నారాయణ క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. ప్రస్తుతం వీరి సమావేశం కొనసాగుతోంది. మరోవైపు సబితను ఆమె నివాసంలో మంత్రులు జానారెడ్డి, వట్టి వసంతకుమార్ కలుసుకుని మాట్లాడారు. డీజీపీ దినేష్ రెడ్డి కూడా సబితతో భేటీ అయ్యారు.