: ఇరాక్ ప్రయాణాలు వద్దు: కేంద్రం సూచన
ఇరాక్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని... ఇరాక్ కు వెళ్లే భారతీయులు అక్కడ పరిస్థితులు చక్కబడేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ లెవింట్ కు చెందిన ఉగ్రవాదులు అనేక పట్టణాలను స్వాధీనం చేసుకుని బాగ్దాద్ వైపునకు వస్తున్న విషయం విదితమే. ఇరాక్ దేశంలోని భారతీయుల కోసం హెల్ప్ లైన్ ను కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాటు చేసింది.