: నా విజయం తల్లిదండ్రులు, గురువులకు అంకితం: ఎవరెస్ట్ విజేత పూర్ణ
తన విజయం తల్లిదండ్రులు, గురువులకు, పాకాల గ్రామానికి అంకితమని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ చెప్పింది. ఆమె స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా పాకాలలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ... ఆడపిల్లలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించానని చెప్పింది. ఎవరెస్ట్ ఎక్కే సమయంలో శవాలను చూసి భయపడ్డానని, అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లానని ఆమె తన అనుభూతులను పంచుకుంది. గిరిజన మహిళలు ఆడపిల్లల్ని అమ్ముకోవద్దని ఆమె చెప్పింది. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించింది.