: చంద్రబాబుతో నెడ్ క్యాప్ వైస్ ఛైర్మన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇవాళ నెడ్ క్యాప్ వైస్ ఛైర్మన్ కమలాకర్ బాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంధన వనరులతో విద్యుదుత్పత్తి అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. సౌర, పవన విద్యుత్ తో పాటు నిరంతరం లభ్యమయ్యే బయోమాస్, మినీ హైరల్, మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన చెత్త ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి అవకాశాల ప్రణాళికను కమలాకర్ చంద్రబాబుకు వివరించారు. విద్యుత్ లోటును తగ్గించి, రాష్ట్రంలో అన్ని అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పెంపుపై చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.