: అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన ఊతప్ప... ఇండియా 99/1


బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి వన్డేలో పటిష్ఠ స్థితిలో ఉన్న భారత్ ను అంపైర్ దెబ్బతీశాడు. 50 పరుగులతో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) మాంచి ఊపుమీదున్న ఓపెనర్ ఊతప్పను ఎల్బీగా ఔటిచ్చాడు. అయితే టీవీ రీప్లేలో బంతి బ్యాటును తాకి ప్యాడ్ ను తాకినట్టు క్లియర్ గా కనపడుతోంది. దీంతో 16.1 ఓవర్లలో 99 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. మరో ఓపెనర్ రహానే 46 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం రహానేకు పుజారా జత కలిశాడు.

  • Loading...

More Telugu News