: నాకు, షర్మిలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు: ప్రభాస్
వైకాపా నాయకురాలు వైఎస్ షర్మిలతో తనకు సంబంధం ఉందన్న పుకార్ల నేపథ్యంలో సినీ హీరో ప్రభాస్ స్పందించాడు. షర్మిలతో తనకు ఎలాంటి పరిచయం కాని, అనుబంధం కాని లేవని స్పష్టం చేశాడు. తమపై జరుగుతున్న ప్రచారం అసత్యమని తెలిపాడు. తన ఆరోగ్యంపై, షర్మిలపై ఎన్నో పుకార్లు వచ్చాయని... మొదట్లో వీటిని సీరియస్ గా తీసుకోలేదని... కానీ, తమ ప్రతిష్ఠకు భంగం కలిగే స్థాయికి ఇది చేరుకోవడంతో తాను స్పందించాల్సి వచ్చిందని అన్నాడు. పుకార్లను వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని తెలిపాడు. చాలా బాధ, ఆవేదనతో ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పాడు.