: విజయవాడలో శ్రీగంధం సాగు చేసే రైతుల కోసం సదస్సు


విజయవాడలో శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను పెంచే రైతుల సమస్యల పరిష్కారం కోసం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 23 జిల్లాల నుండి శ్రీ గంధం, ఎర్రచందనం చెట్లను పెంచే రైతులు వచ్చారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు అధ్యక్షుడు వీవీరావు చెప్పారు. ఆసక్తి ఉన్న రైతు తమ సంఘంలో చేరవచ్చని ఆయన తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని, అలా మోసపోయే వారికి అండగా తమ సంఘం ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News