: స్వీపర్ డాక్టర్ గా మారాడు .. చిన్నారి వేలును కోసేసాడు ...


హాస్పిటల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనం. వైద్య సేవలు అందించాల్సిన చోట అవసరానికి ఒక్క డాక్టర్, నర్స్ అడ్రస్ లేకుండా పోయారు. సందట్లో సడేమియా అనుకుంటూ హాస్పిటల్ స్వీపరే వైద్యావతారం ఎత్తాడు. చిన్నారి వేలును తెగ్గోశాడు.

రాజస్థాన్ లోని బార్మర్ హాస్పిటల్ లో ఇది జరిగింది. ఒక చిన్నారి వేలుకి గాయమైతే కుట్లు వేశారు. వాటిని తీసివేయాల్సి ఉంది. డాక్టర్లు లేదా నర్సులు ఆ పని చేయాలి. కానీ వారు లేరని స్వీపరే కుట్లు విప్పడానికి ట్రై చేశాడు. కానీ, అతడి వల్ల కాలేదు. ఏ మాత్రం దయ లేకుండా, అసహనంతో ఆ చిన్నారి వేలును కత్తిరించేసి అవతల పారేశాడు. ఆ బాధకు చిన్నారి లబోదిబోమంది. మళ్లీ ఆ వేలు కోసం వెతికినా దొరకలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు .

  • Loading...

More Telugu News