: తల్లి అయిన సినీతార మంచు లక్ష్మి
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె, సినీ తార మంచు లక్ష్మి పండంటి బిడ్డకు తల్లైంది. సర్రోగసి విధానం ద్వారా ఆమె తల్లి అయింది. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సర్రోగసి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లలను కనే విధానం. ఇటీవలే బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా సర్రోగసి ద్వారా మరో బిడ్డకు తండ్రి అయ్యారు.