: ధవళేశ్వరం ఆనకట్ట నుంచి తూర్పు, మధ్య డెల్టాలకు సాగునీరు విడుదల
రాజమండ్రిలోని ధవళేశ్వరం ఆనకట్ట నుంచి తూర్పు, మధ్య డెల్టాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. తద్వారా ఖరీఫ్ సీజన్ కు సాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధవళేశ్వరం సర్కిల్ ఎస్.ఈ. సుగుణాకర్ రావు కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రూ.191 కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, అందులో సగం ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.