: తెలంగాణలో పాలన గందరగోళంలో ఉంది: కిషన్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో పాలనాయంత్రాంగం మొత్తం గందరగోళంలో ఉందని టీ.బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. మంత్రులకు కూడా అవగాహన లేకుండా పోయిందని ఆరోపించారు. రైతు రుణమాఫీపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొందని... హైదరాబాదులో కూడా అప్రకటిత విద్యుత్ కోతను అమలు చేస్తున్నారని అన్నారు. విధానపరమైన నిర్ణయాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నెమ్మదిగా ఉందని... వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

  • Loading...

More Telugu News