: బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించిన రాజయ్య
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య బీబీనగర్ రంగాపూర్ లో అసంపూర్తిగా ఉన్న నిమ్స్ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే యాదరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పల్లె ప్రజలకు ప్రభుత్వ మందులు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని రాజయ్య అన్నారు. రూ. 72 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన నిమ్స్ భవనంలో తొమ్మిదేళ్లు గడుస్తున్నా వైద్య సేవలు అందించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నిమ్స్ కు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.