: బడ్జెట్ తయారీపై తొలి సంతకం చేసిన యనమల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం యనమల మాట్లాడుతూ, బడ్జెట్ తయారీపై తొలి సంతకం చేశానని తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ను తీరుస్తామని అన్నారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని... కానీ, ప్రజలపై ఎలాంటి భారం మోపమని తెలిపారు.

ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా సచివాలయంలో ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు.

  • Loading...

More Telugu News