: ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ శాసనసభ సమావేశాలు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 19 నుంచి 24 వరకు జరగనున్నాయి. 18వ తేదీన ప్రొటెం స్పీకర్ గా నారాయణస్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. 19వ తేదీన చంద్రబాబు సహా ఇతర సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అక్షర క్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. 20న అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. 21న శాసనసభ, మండలినుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇక 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది.

  • Loading...

More Telugu News