: తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి 'టీఎస్' నెంబర్లు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లోని వాహనాల నెంబర్ల సిరీస్ మారింది. ఏపీ స్థానంలో టీఎస్ ను అధికారులు చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో నెంబర్ ప్లేట్లపై ఉన్న ఏపీ స్థానంలో టీఎస్ చేర్చాలని ప్రభుత్వం పేర్కొన్న విషయం విదితమే. ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీఎస్ కింద నెంబర్లను కేటాయిస్తారు.