: రాజధానే కాదు...మిగతా నగరాల అభివృద్ధికి కూడా సిఫారసు చేస్తాం: శివరామకృష్ణన్ కమిటీ
శివరామకృష్ణన్ కమిటీ కేవలం రాజధానిని మాత్రమే సూచించదని, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన నగరాల అభివృద్ధికి కూడా సూచనలు చేస్తుందని ఆ కమిటీ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, రెండు మూడు వారాల్లో దక్షిణాంధ్రలో పర్యటిస్తామని చెప్పారు. రాజధాని అంశంపై ఆగష్టు 31 లోగా నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమతో చెప్పలేదని వారు స్పష్టం చేశారు.
రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కమిటీ నిర్ధారించింది. రాజధాని నిర్మాణానికయ్యే పూర్తి ఖర్చును బిల్లులో పేర్కొన్న విధంగా కేంద్రమే భరిస్తుందని కమిటీ తెలిపింది. రాజధాని నిర్మాణానికి, అవసరాలకు అనుగుణంగా ఖర్చు ఉంటుందని వారు తెలిపారు.