: మద్యాన్ని ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మితే ఊరుకోం: పద్మారావు
మద్యాన్ని గరిష్ఠ అమ్మకం ధర (ఎంఆర్పీ) కన్నా ఎక్కువకు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. మొదటిసారి తప్పు చేసినట్టు తేలితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. అదే మద్యం దుకాణదారు మూడుసార్లు తప్పు చేస్తే మద్యం లైసెన్సును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.