: మోడీ భూటాన్ పర్యటన చరిత్రాత్మకం: భూటాన్ ప్రధాని


ప్రధానమంత్రిగా తొలిసారి నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనను భూటాన్ తో ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఆయన ఆ దేశం వెళుతున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. దీనిపై ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ టొబ్గే స్పందిస్తూ, బాధ్యతలు చేపట్టాక, నెలలోనే మోడీ భూటాన్ పర్యటనకు రావడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. దీనిపై తాను ఓ సార్క్ సభ్యుడిగానే కాకుండా మోడీకి ఆప్తమిత్రుడిగా చాలా సంతోషంగా ఉన్నానన్నారు.

  • Loading...

More Telugu News