: హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలపై చర్యలకు రంగం సిద్ధం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో హైదరాబాదుకు చెందిన 24 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతికి బాధ్యతగా సదరు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలపై చర్యలకు తీసుకునేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రమాదం నుంచి బయటపడ్డ మిగతా 24 మంది విద్యార్థుల నుంచి ఈ రోజు వాంగ్మూలం తీసుకున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యమే విద్యార్ధుల ప్రాణాలకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. అటు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులను బెదిరిస్తే సహించేది లేదన్నారు.

  • Loading...

More Telugu News