: అరుణ్ జైట్లీతో ఒమర్ అబ్దుల్లా భేటీ
కేంద్ర ఆర్ధిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ భద్రతా బలగాల సన్నాహాలను పరిశీలించారు. అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమై భద్రత, ఆర్ధిక అంశాలపై చర్చించారు. దేశ భద్రతలో రాజీ పడే అవకాశమే లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు వెనుకడుగు వేయవద్దని ఆయన అబ్దుల్లాకు సూచించారు. తమ మధ్య చర్చలు ఫలప్రదంగా ముగిశాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.