: కృష్ణా జిల్లాలో బయటపడిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి విగ్రహం


కృష్ణా జిల్లాలో పంచలోహ శ్రీలక్ష్మీ నరసింహస్వామి విగ్రహం బయటపడింది. గూడూరు మండలంలోని కంకటావ గ్రామంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా ఈ విగ్రహం వెలుగు చూసింది. దీంతో స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థుల సమక్షంలో విగ్రహాన్ని పరిశీలించారు. ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్ఐ నరసింహం చెప్పారు.

  • Loading...

More Telugu News