: కావేరి నదీ జలాలపై మోడీకి కరుణానిధి లేఖ
కావేరి నదీ జలాలపై బోర్డు ఏర్పాటు చేయమంటూ తమిళనాడులో రాజకీయం ఊపందుకుంది. దీనిపై తక్షణమే చట్టం ప్రకారం బోర్డు ఏర్పాటు చేయాలంటూ డీఎంకే అధినేత కరుణానిధి ప్రధానమంత్రి మోడీకి ఈ రోజు లేఖ రాశారు. అప్పుడు కర్ణాటక రిజర్వాయర్ నుంచి కావేరి జలాలను తమిళనాడుకు విడుదలచేసే విషయాన్ని సదరు బోర్డు పర్యవేక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం రగులుతూనే ఉంది. అటు రెండు రోజుల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బోర్డు ఏర్పాటు చేయాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.